పవన్ కళ్యాణ్ పై రావెల సంచలన వాఖ్యలు – అందుకే పార్టీ మారాడా…?

Monday, June 10th, 2019, 09:06:52 PM IST

ఇటీవలే జనసేనాని వదిలిన రావేలా కిషోర్ బాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు… కాగా జనసేన ని వదిలిన రావెల నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ లో చేరిన సంగతి మనకు తెలిసిందే… అయితే గుంటూరులో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న రావెల జనసేన ప్రవర్తనను తప్పుపడుతూ మాట్లాడారు. అంతేకాకుండా తనకి జనసేన పార్టీలో తనానికి ఒక కీలకమైన పదవి ఇచ్చారని చెప్పుకోవడం అనేది కేవలం మాటలవరకే పరిమితం అని, అది మాత్రం చేతల్లో అసలే కనబడలేదని రావెల వాపోయారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన సలహాలని పాటించలేరని, అసలు తన నుండి ఎలాంటి సలహాలు కూడా అడిగేవారు కాదని, సూచనలు తీసుకోలేదని రావెల కిశోర్ బాబు అన్నారు.అంతేకాకుండా నేను పార్టీలో ఒక కీలకమైన నేతగా ఉన్నప్పటికీ కూడా కనీసం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా తనకు దొరికేది కాదని, ఫోన్లో కూడా మాట్లాడే వాళ్లు కాదని చెప్పారు. పైకి సన్నిహితంగా కనిపించినప్పటికీ, రాజకీయపరమైన వ్యూహాలపై మాట్లాడానికి కూడా తనకు అసలు అవకాశం రాలేదని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జనసేన కి టీడీపీ తో పొత్తు ఉందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం ప్రజల అపనమ్మకం వల్లనే జనసేన ఐ సరిగా ఓట్లు పడలేదని రావెల స్పష్టం చేశారు…