వీళ్ళు ఎవరి కౌగిలికైనా రెడీ అట!

Tuesday, July 14th, 2015, 09:55:41 AM IST


ఆధునిక ప్రపంచం కొత్త పోకడలకు పోతోందని చెప్పేందుకు నిదర్శనగా ఆస్ట్రేలియాలో ఒక జంట విచిత్ర చేష్టలకు తెరతీసింది. ఇక వివరాల్లోకి వెళితే ఇటలీకి చెందిన 20ఏళ్ళ ఎరికా డెల్లామురా, ఆమె భర్త 21ఏళ్ళ నికోలో మర్మిరోలీ గత ఏడు నెలలుగా ఆస్ట్రేలియాలో వర్కింగ్ వీసాతో పర్యటిస్తున్నారు. ఇక తమ పర్యటనకు డబ్బులు లేక వీరు ‘మమ్మల్ని ఎవరైనా కౌగిలించుకోవచ్చు’ అని బోర్డు పెట్టుకుని, కళ్ళకు గంతలు కట్టుకుని నడి రోడ్డుపై చేతులు చాచుకుని నిలుస్తున్నారు.

కాగా తాము చేస్తున్న ఈ పని కేవలం డబ్బు కోసం మాత్రమే కాదని చెబుతున్న ఈ జంట, మాకు ప్రజలపై నమ్మకముందని, ప్రజలు కూడా మాపై నమ్మకం ఉంచాలని, వచ్చి మమ్మల్ని ఉచితంగా కౌగిలించుకోవచ్చని, కావాలంటే ఇక్కడ ఉన్న పెట్టెలో నగదు వెయ్యోచ్చని, ఆ డబ్బు మీ అందమైన దేశాన్ని చూసేందుకు తమకు ఉపయోగపడుతుందని బోర్డు రాసి పెట్టి మరీ ఉంచారు. ఇక రోజుకో కొత్త ప్రదేశంలో ఈ విధంగా సంచరిస్తున్న ఈ కొత్త జంట తమను కౌగిలించుకున్న వారు కొంతమంది థాంక్స్, హ్యాపీ జర్నీ అని చెబుతున్నారని, మరికొందరు అక్కున చేర్చుకుని ఏడుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏదైమైనా వీరు చేస్తున్న కౌగిలింతల పర్వంతో ప్రపంచ దృష్టిని బాగానే ఆకర్షించారు.