పంది పిల్ల పళ్లు తోమిన దర్శకుడు

Tuesday, May 29th, 2018, 05:47:51 PM IST

హారర్ కామెడీ థ్రిల్లర్ వంటి సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. అయన గత కొంత కాలం నుంచి ఒక పంది పిల్లతో స్నేహం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దానితో అదిగో సినిమా చేయాలనీ ముందు నుంచి అనుకుంటున్న రవిబాబు గతంలో వినూత్న స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. ఏటీఎం దగ్గర పందితో నిలబడి అందరిని ఆకట్టుకున్నాడు. అలాగే అప్పట్లో విడుదల చేసిన ఓ టీజర్ కూడా అందరిని ఆకర్షించింది.

ఇక రీసెంట్ గా రవి బాబు తండ్రి చలపతి రావు ఫెస్ బుక్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో రవిబాబు పంది పిల్లకు పళ్లు తోమూతు కనిపించాడు. ఇక చలపతి రావ్ ఒక చిన్న కామెంట్ పెట్టారు. ఈ సినిమా మీ అందరిని బాగా నవ్విస్తుంది మీ అశీసులు ఈ సినిమా కి ఉంటాయి అని కోరుకుంటున్నా. ఈ సినిమా ఒకటే కాదు ప్రతి సినిమా కూడా మీ అశీసులు ఉండబట్టే సినిమాలు బాగా ఆడుతున్నాయి ప్రేక్షక దేవుళ్ళకు మరొకసారి నమస్కారములు మీకు ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేసి చూపించండిని చలపతి రావ్ పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments