” కాస్టింగ్ కౌచ్ ” ఆడవాళ్లకే కాదంటున్న నటుడు?

Saturday, May 26th, 2018, 06:18:54 PM IST

కాస్టింగ్ కౌచ్ .. ప్రస్తుతం సినిమా పరిశ్రమను పట్టిపీడిస్తున్న అంశం. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ నటుడు మాత్రం కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఆడవాళ్లకే కాదని .. మగవాళ్లకు ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఇంత పెద్ద షాక్ ఇచ్చిన నటుడు ఎవరో కాదు రవి కిషన్. రేసుగుర్రం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న రవికిషన్ తాజాగా ఓ సందర్బంగా కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు. అవకాశాలు ఇవ్వాలంటే పక్కలో పడుకోవాలి అని మగవాళ్ళను రమ్మనే ప్రబుద్ధులు , నారీమణులు ఉన్నారని చెప్పాడు. అలా చేస్తే వ్యభిచారం చేసినదానికంటే ఎక్కువే అని, అలా చేస్తేనే ఇక్క్కడా నిలదొక్కుకుంటామని కానీ దానివల్ల దిగజారిపోతామని అన్నాడు. ఇలాంటి ఇబ్బందుల వాళ్ళ శారీరకంగా . .మానసికంగా కూడా దిగజారిపోతామని అన్నారు. భోజపురి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్ అటుపై హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారాడు !!

  •  
  •  
  •  
  •  

Comments