చివరికి రవిప్రకాష్ హాజరుకాక తప్పలేదుగా…?

Tuesday, June 4th, 2019, 08:38:27 PM IST

గత కొంత కాలంగా నేరారోపణలు ఎదుర్కున్నటువంటి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చివరికి నేడు సైబరాబాద్ క్రైం పోలీసుల ముందు హాజరయ్యారు. కాగా రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నటువంటి పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. అయితే అలంద మీడియా ఫిర్యాదు మేరకు రవిప్రకాష్ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో కోర్టు నోటిసులని పట్టించుకోనటువంటి రవిప్రకాష్, ఇప్పుడు సడన్ గా సైబరాబాద్ క్రైం పోలీసుల ముందు హాజరవడం అనేది ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. కానీ రవిప్రకాష్ పెట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనట్లు ప్రధాన సమాచారం. అయితే ఈ ఆరోపణలు ప్రారంభమయినప్పటినుండే రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

కానీ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం రెండు సార్లు పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఈ విషయం మీద స్పందించిన సుప్రీం కోర్టు బెయిల్ అంశం హై కోర్టులోనే తేల్చుకోవాలని, అంతేకాకుండా అరెస్టుకు 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఇకపోతే రవిప్రకాశ్ పోలీసులు రెండు సార్లు నోటీసులపై ఇప్పటికే రెండు సార్లు గైర్హాజరయిన సంగతి మనకు తెలిసిందే… కాకపోతే రవిప్రకాష్ పెట్టుకున్న ఆశలు, బెయిల్ దారులన్నీ కూడా ముసుకపోవడంతో చివరికి హాజరు కాక తప్పలేదని సమాచారం.