కేసు ముదిరిందిగా… రవిప్రకాష్ ఇక జైలుకేనా…?

Sunday, June 9th, 2019, 10:41:03 AM IST

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై నమోదైనటువంటి కేసులు రోజురోజుకు ముదురుతున్నాయి… తనమీద నమోదైన కేసులు కూడా నిజాలుగా నిరూపితమవుతున్నాయి… మరికొన్ని గంటల్లో రవిప్రకాష్ కి బెయిల్ వస్తుందా లేక జైలుకి వెల్లనున్నాడా అనేది తెలిసిపోతుంది… అయితే టీవీ9 చానెల్ ట్రేడ్ మార్క్ ను రవిప్రకాష్ కేవలం రూ. 99 వేలకు మోజో టీవీకి విక్రయించాడని, అందుకు సరైన ఆదరకోసం బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ ని దాదాపుగా ఐదు గంటల పాటు విచారించినప్పటికీ కూడా, రవిప్రకాష్ నుండి ఎలాంటి సరైన సమాధానం రాబట్టలేకపోయారనేది పోలీసుల వాదన. అంతేకాకుండా రవిప్రకాష్ అసలే విచారణకు సహకరించడం లేదనేది పోలీసుల వాదన… అయితే రవిప్రకాశ్ వేసిన మరో బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఒకవేళ రవిప్రకాష్ కి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడం నిరాకరిస్తే మాత్రం, అక్కడే నోటీసులు ఇచ్చి రవిప్రకాష్ ని అరెస్టు చేయాలనీ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే న్యాయమూర్తి ఇచ్చే తీర్పుపై వారి నిర్ణయం ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రవిప్రకాష్ కి ముందస్తు బెయిల్ వస్తే మాత్రం పెద్ద ఊరట లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.