రాజా ది గ్రేట్ .. అంటున్న రవితేజ ?

Sunday, January 22nd, 2017, 09:45:41 PM IST

RAVITEJA
‘బెంగాల్ టైగర్’ తరువాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఓకే చెప్పని రవితేజ ప్రస్తుతం హాలిడేస్ ని ఎంజాయ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. హాలిడేస్ ని ఎంజాయ్ చేసిన అయన ఫైనల్ గా ”పటాస్” ఫేమ్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నా ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది. బెంగాల్ టైగర్ సినిమా తరువాత రవితేజ తన ఓల్డ్ గెటప్ లో వచ్చెనందుకు ట్రై చేస్తున్నాడట. ఇక అనీల్ రావిపూడి రూపొందించే ఈ సినిమా పక్క మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని, ఈ సినిమాకు ”రాజా ది గ్రేట్” అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిసింది ? అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తాడని సమాచారం. గతంలో దిల్ రాజు తో రవితేజ సినిమా చేయాల్సి ఉండగా .. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడు అనీల్ సినిమాతో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారట !! సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.