రవితేజ ఇష్టపడ్డాడు .. గోపీ చంద్ లాక్కున్నాడు

Friday, February 10th, 2017, 11:37:36 AM IST


కొందరి స్క్రిప్ట్ లో మరి కొందరికి వెళ్ళిపోవడం సినిమా పరిశ్రమ లో చాలా సాధారణ విషయం. కానీ ఒక హీరో చాలా ప్రేమగా స్క్రిప్ట్ ని ఇష్టపడి అది వేరే హీరోకి వెళ్ళిపోతే మాత్రం పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. బెంగాల్ టైగర్ లాంటి సక్సస్ తరవాత హీరో రవితేజ రాబిన్ హుడ్ అనే సినిమా తీస్తున్నాడు అని టాక్ నడిచింది. చక్రి అనే కొత్త డైరెక్టర్ చెప్ప్పిన స్టోరీ విపరీతంగా నచ్చేసిన రవితేజ ఆ కథ కి ఓకే చెప్పాడు అనీ అన్నారు. కాకపోతే రెమ్యునరేషన్ విషయం లో రవి పెట్టిన షాక్ కి నిర్మాతలు షాక్ అయ్యారు అనీ అందుకే సినిమా ఆగింది అన్నారు. కొన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఏడాది తరవాత ఈ సినిమా హీరో గోపీ చంద్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రవితేజ ప్లేస్ లోకి గోపీచంద్ వచ్చి చేరాడు. గోపీచంద్ హీరోగా చక్రి దర్శకత్వంలోనే రాబిన్ హుడ్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు.
బెంగాల్ టైగర్ సక్సెస్ తో సక్సెస్ సాధించిన సంపత్ నంది దర్శకత్వంలో.. ప్రస్తుతం గౌతమ్ నందా అనే మూవీ చేస్తున్నాడు గోపీచంద్. ఈ మూవీ పూర్తయ్యేనాటికే.. కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందిట. గోపీచంద్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ రాబిన్ హుడ్ అంటున్నారు సినీ జనాలు.