రవితేజ సినిమాకు 18 కోట్లా?..రిలీజ్ కూడా అవ్వలేదు

Monday, September 25th, 2017, 11:27:25 PM IST

ఎంతో కష్టపడి సినిమా రంగంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మహారాజ రవితేజ.అయితే గత కొంత కాలంగా రవి తేజ కాస్త అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని దిల్ రాజు బ్యాన్నర్ లో “రాజా ది గ్రేట్” సినిమా ద్వారా రాబోతున్నాడు. పటాస్ – సుప్రీమ్ వంటి వరుస హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో అయితే సినిమా విడుదల అవ్వకముందే హిందీ రీమేక్ హక్కులు 18 కోట్లకి అమ్మడు పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఓ ప్రముఖ బడా నిర్మాత రాజా ది గ్రేట్ స్క్రిప్ట్ గురించి తెలుసుకొని సినిమా కథను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తుండగా రవి తేజ సరసన మెహ్రీన్ పిర్జాద హీరోయిన్ గా నటిస్తోంది. రావితేజ ఈ సినిమాలో అంధుడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే!

  •  
  •  
  •  
  •  

Comments