ర‌విప్ర‌కాష్ : తెలంగాణ ప్ర‌భుత్వం వెంటాడుతోంది

Tuesday, June 11th, 2019, 02:09:00 PM IST

నాకు ద‌క్క‌నిది ఎవ‌రికి ద‌క్క‌కూడ‌దు అని `మ‌గ‌ధీర‌`లో విల‌న్ ఆలోచ‌న ఫక్తు అదే ఆలోచ‌నల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు టీవి9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్. త‌న చుట్టూ ఉచ్చు బిగుస్తుండ‌టంతో టీవీ9 ఎలా ఏర్ప‌డింది?. దానికి నిధులు ఎలా వ‌చ్చాయి?. ఈ విష‌యాల‌న్నింటినీ బ‌య‌ట‌పెట్టి టీవి9 ఛాన‌ల్ మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేశారు ర‌విప్ర‌కాష్‌. త‌న చేతులు మారుతున్న ఛాన‌ల్ త‌న‌ది కాకుండా పోతున్న‌ప్ప‌డు దాన్ని మ‌రొక‌రి పాలు కాకుండా నాశ‌నం చేయాల‌న్న ఆలోచ‌నే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయించ‌న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సోమ‌వారం విచార‌ణ నిమిత్తం హైకోర్టుకు హాజ‌రైన ర‌విప్ర‌కాష్ తెలంగాణ ప్ర‌భుత్వం త‌న‌ని వేధిస్తోంద‌ని, టీవీ9 హ‌వాలా డ‌బ్బుతో ఏర్పాటైంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

టీవి9 ప్రారంభానికి మారిష‌స్ నుంచి హ‌వాలా మార్గంలో ఫెమా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా 60 కోట్ల డ‌బ్బు అందింద‌ని, టీవి9 వాటా విక్ర‌యించిన సంద‌ర్భంలోనూ కార్శీర్‌లో ఉగ్ర‌వాదుల‌కు నిధులు త‌ర‌లించే మార్గాల్లోనే నిధులు త‌ర‌లించారంటూ హైకోర్టులో ర‌విప్ర‌కాష్ వెల్ల‌డించ‌డం ఒక్క‌సారిగా సంచ‌ల‌నానికి దారి తీసింది. ఈ నిధుల‌పై ద‌ర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రీకి ఫిర్యాదు చేశాన‌ని. అప్ప‌టి నుంచే తెలంగాణ ప్ర‌భుత్వం త‌న‌ను వేధించ‌డం మొద‌లుపెట్టింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ర‌విప్ర‌కాష్ ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా జ‌స్టిస్ గండికోట శ్రీ‌దేవి సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టారు.

ర‌విప్ర‌కాష్ త‌రుపు న్యాయ‌వాది వాదిస్తూ త‌న క్లైంట్ ను 40 గంట‌ల పాటు విచారించార‌ని, టీవి9 90 శాతం వాటా కోసం 500 కోట్లకు ర‌హ‌స్య ఒప్పందం జ‌రిగింద‌ని, అయితే ఇందులో 294 కోట్లు న‌గ‌దుగా ఇచ్చార‌ని, మిగ‌తా మొత్తాన్ని హ‌వాలా మార్గంలో త‌ర‌లించార‌ని న్యాయ‌వాది వెల్ల‌డించారు. ర‌విప్ర‌కాష్ వివాదంలో ఎన్‌హెచ్ వో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల్సి వుండ‌గా స్వ‌యంగా ఏసీపీ రంగంలోకి దిగి ద‌ర్యాప్తు చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తే ఏ స్థాయిలో అధికార దుర్విన‌యోగం జర‌గిందో అర్థ‌మ‌వుతుంద‌ని ర‌విప్ర‌కాష్ త‌రుపు న్యాయ‌వాది ద‌ల్జీత్ సింగ్ వాదించారు. ఈ కేసు నుంచి త‌ను త‌ప్పించుకోవ‌డం కోసం తెలివిగా ర‌విప్ర‌కాష్ టీవి9 ఛాన‌ల్ నే గుర్తింపునే ర‌ద్దు చేసేలా స్కెచ్చు వేయ‌డం ఎవ‌రికీ మింగుడుప‌డ‌టం లేదు. పైగా ఈ కేసులో తెలంగాణ ప్ర‌భుత్వం అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నాలు ర‌విప్ర‌కాష్ చేయ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు.