నాకు ఈ పరిస్థితి రాడానికి కారణం ఆ ఇద్దరే… – రవిప్రకాష్

Wednesday, June 5th, 2019, 03:20:06 AM IST

ఎట్టకేలకు టీవీ9 మాజీ సీఈఓ సైబరాబాద్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు… అందులోభాగంగా రవిప్రకాష్ తొలిరోజు విచారణ పూర్తయింది. దాదాపుగా 5 గంటల పాటు జరిగిన ఈ విచారణలో రవిప్రకాష్ కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావించాడని సమాచారం. కాగా ఈ విచారణ అనంతరం మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రవిప్రకాష్ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ధనిక వ్యాపారవేత్తలు నన్ను మోసగించారు, టీవీ9ను అక్రమంగా కొనుగోలు చేశారని, అందువల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని రవిప్రకాష్ తెలిపారు. అంతేకాకుండా టీవీ9 లో జరిగే అక్రమాలనుబయటకు రాకుండా ఆపడం కోసం దొంగ బోర్డు మీటింగులు పెట్టిన విషయం బయటకు రాకుండా కాపాడేందుకే తనపై దొంగ కేసులు పెట్టారని రవిప్రకాష్ ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా ఎడ్యుకేషన్ మాఫియా, కాంట్రాక్టర్ మాఫియా, బిల్డర్ మాఫియా అన్ని కూడా మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకొని వాస్తవాలను తొక్కిపడేస్తున్నారని, అందుకు చాలా కుట్రలు జరుగుతున్నాయని రవిప్రకాష్ అన్నారు. అందుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినందుకే తన మీద నేరారోపణలు చేశారని, కానీ అలంటి తప్పుడు బెదిరింపులకు భయపడనని, ప్రాణం ఉన్నంత వరకు కూడా వాస్తవం కోసం, సమాజ హితం కోసం పోరాటం చేస్తానన్నారు. ఈ భేటీ తరువాత మరోసారి విచారణకు హాజరు కావాలని రవిప్రకాష్ కి అధికారులు సూచించారని తెలిపారు.