అమర్ అక్బర్ ల డేట్ లాక్ చేసేసారు ?

Tuesday, September 11th, 2018, 11:15:05 PM IST


మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎఎంటర్ టైనర్ అమెరికాలో ఓ భారీ షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది. దీనితో ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తీ కావొచ్చింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి టాక్ రావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఈ మద్యే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన రవితేజ కు రాజా ది గ్రేట్ కాస్త పరవాలేదనిపించుకుంది. అయితే తన కెరీర్ లో మంచి సినిమాలను చేసిన శ్రీను వైట్ల ఇప్పటికే వెంకీ, నీ కోసం, దుబాయ్ శీను లాంటి క్రేజీ హిట్స్ ఇవ్వడంతో ఈ సారి ఆయనకే ఛాన్స్ ఇచ్చాడు మాస్ రాజా. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ మూడు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. ఈ చిత్రాన్ని వచ్చే నెల 5న విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments