సంక్రాంతి రేసులో ఓడిపోయిన మహేష్ బాబు..!

Thursday, January 25th, 2018, 11:08:21 PM IST

మహేష్ సినిమా సంక్రాంతికి విడుదల కాలేదు కదా.. మరి ఇదేంటి అనుకుంటున్నారా ! అక్కడికే వస్తున్నా.. సంక్రాంతి పండగ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని చిత్రాలు బుల్లితెరపై సందడి చేశాయి. వాటిలో మహేష్ బాబు స్పైడర్, రవితేజ చిత్రం రాజా ది గ్రేట్ మరియు ఎన్టీఆర్ జైలవకుశ చిత్రాలు ఉన్నాయి. ఇక శర్వానంద్ తన మహానుభావుడు చిత్రంతో ఈ స్టార్ హీరోలతో పోటీ పడ్డాడు. బుల్లితెర రేసులో రవితేజ మరియు ఎన్టీఆర్ సమ ఉజ్జీలుగా నిలిచారు. మహేష్ బాబయ్ స్పైడర్ చిత్రం రాజా ది గ్రేట్ మరియు జై లవ కుశ చిత్రాలతో పోటీ పడలేక రేసులో చాలా వెనుకబడిపోయింది.

రాజా ది గ్రేట్ చిత్రానికి 17.7 టిఆర్పి రేటింగ్ రాగా జై లవ కుశ చిత్రానికి కూడా అదే రేటింగ్ రావడం విశేషం. ఇక స్పైడర్ చిత్రం మహేష్ బాబు సినిమాల్లోనే అతి తక్కువ రేటింగ్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కేవలం 6. 7 రేటింగ్ మాత్రమే రావడం గమనార్హం. థియేటర్ లలో సైతం ఈ చిత్రం అభిమానులని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. సాధారణంగా మహేష్ బాబు సినిమా హిట్టయినా ప్లాపైనా టిఆర్పి రేటింగులు మాత్రం బాగా వచ్చేవి. కానీ స్పైడర్ చిత్రం విషయంలో మాత్రం ప్రేక్షకులు అనాసక్తిని ప్రదర్శించారు. ఇక శర్వానంద్ మహానుభావుడు చిత్రం 8.3 రేటింగ్ తో పరవాలేదనిపించింది.