మొత్తానికి రవితేజ దిగొచ్చాడుగా !!

Wednesday, September 28th, 2016, 08:26:54 PM IST

RAVITEJA
”కిక్ 2” సినిమా సమయంలో బాగా సన్నబడ్డాడు రవితేజ, అయన సన్నబడడం ప్రేక్షకులకు నచ్చలేదు, అందుకే ఆ సినిమా జనాలకు అంతగా ఎక్కలేదు. దాంతో బరువు పెరుగుతూ ”బెంగాల్ టైగర్” చేసాడు. ఆ సినిమా బాగానే ఆడింది. ఇక ‘బెంగాల్ టైగర్’ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా రవితేజ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి రాలేదు. రవితేజ ఇప్పటికే చాల కథలు వింటున్నాడు, పైగా దిల్ రాజు సినిమా కూడా కాదనుకున్నాడు. దానికి కారణం రెమ్యూనరేషన్ అన్న విషయం తెలిసిందే. ఇక పదికోట్ల వరకు రవితేజ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసాడట. అయితే ఈ మధ్య అయన మార్కెట్ బాగా తగ్గడంతో అంత ఇవ్వలేమని నిర్మాతలు చెప్పడంతో ఏ సినిమాకు అయన ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే ఇంత వరకు ఏ సినిమా ఓకే చెయ్యలేదు, ఇప్పటికే ముగ్గురు, నలుగురు దర్శకులు కథలు చెప్పి ఓకే అనిపించారు కానీ సెట్స్ పైకి వెళ్లడం లేదు, తన భారీ రెమ్యూనరేషన్ వల్లే సినిమాలు రావడం లేదని తెలుసుకున్నట్టున్నాడు రవితేజ అందుకే ఇప్పుడు రెమ్యూనరేషన్ తగ్గించినట్టు తెలిసింది. ఏకంగా ఆయన తన రెమ్యూనరేషన్ లో రెండు కోట్లు తగ్గించాడట !! మరి రవితేజ రెమ్యూనరేషన్ తగ్గించాడు కాబట్టి .. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తాడేమో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments