తండ్రి కొడుకులుగా .. మాస్ రాజా ?

Thursday, September 6th, 2018, 09:29:24 AM IST

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు బిన్నమైన లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమా తరువాత అయన మరో సినిమాకు ఓకే చెప్పాడు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అయితే ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడట. అదికూడా తండ్రి కొడుకులుగా కనిపిస్తారని టాక్. రవితేజ కెరీర్ లో భిన్నమైన సినిమాగా ఇది తెరకెక్కనుందట. అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమా చేసిన ఈ దర్శకుడు ఆ మధ్య అల్లు అర్జున్ తో సినిమాకు ప్లాన్ చేసాడు కానీ అది వర్కవుట్ కాలేదు .. దాంతో రవితేజ ఛాన్స్ ఇచ్చాడట. మరి తండ్రి కొడుకులుగా రవితేజ ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments