సోగ్గాడే చిన్నినాయ‌నా-2`లో ర‌వితేజ‌?

Friday, October 20th, 2017, 06:30:54 PM IST

తొలి ప్ర‌య‌త్న‌మే కింగ్ నాగార్జున లాంటి స్టార్‌తో `సోగ్గాడే చిన్ని నాయ‌నా` చిత్రం తీసి మెప్పించారు క‌ళ్యాణ్ కృష్ణ‌. ఆ వెంట‌నే అక్కినేని కాంపౌండ్‌లోనే నాగ చైతన్య హీరోగా `రారండోయ్ వేడుక చేద్దాం` సినిమా చేసే అవ‌కాశం అందుకున్నాడు. తొలి రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టాయి. ఇక ఇదే హుషారులో ప‌లువురు స్టార్ల‌కు క‌థ‌లు వినిపించాడు క‌ళ్యాణ్‌.

సోగ్గాడే చిత్రానికి సీక్వెల్ క‌థ‌ను రాసుకుని కింగ్‌కి వినిపించాడు అప్ప‌ట్లో. బంగార్రాజు అనే టైటిల్ వినిపించింది. నాగార్జున ఈ సినిమాలో న‌టించేందుకు డిసైడ్ అయ్యారు. కానీ ప్రస్తుత స‌న్నివేశంలో.. నాగార్జున ఆ సినిమా చెయ్యడం కష్టమేన‌న్న‌ది ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. అయితే ఇటీవ‌లే క‌ళ్యాణ్ ఈ క‌థ‌నే మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు వినిపించ‌డుట‌. ర‌వితేజ‌కు ఈ కథ న‌చ్చింద‌ని చెబుతున్నారు. సోగ్గాడేకి సీక్వెల్ లా కాకుండా ఓ కొత్త పంథాలో ఈ క‌థ‌ను మ‌లిచాడ‌ని.. అందుకే ర‌వితేజ‌కు న‌చ్చింద‌ని చెబుతున్నారు. ర‌వితేజ ప్ర‌స్తుతం `రాజా ది గ్రేట్‌`తో స‌క్సెస్ అందుకుని, ట‌చ్ చేసి చూడు చిత్రంలో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి శ్రీ‌నువైట్ల‌తో సినిమా చేయ‌నున్నాడు. ఆ క్ర‌మంలోనే క‌ళ్యాణ్ కృష్ణ‌తో సినిమా సెట్స్‌కెళ్లే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వివ‌రాలు అధికారికంగా తెలియాల్సి ఉందింకా.