షూటింగ్ లో రవితేజకు గాయాలు ?

Monday, February 26th, 2018, 11:15:11 AM IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ లో గాయపడ్డాడని తెలిసింది. మోనో వీల్ నడుపుతున్న సమయంలో అది అదుపు తప్పడంతో అయన కింద పడిపోయాడని .. బాగానే దెబ్బలు తగిలినట్టు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని .. ఈ విషయాన్నీ గోప్యాంగా ఉంచినట్టు టాక్ ? రవితేజ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేల టికెట్ అనే టైటిల్ పెడుతారంటూ ప్రచారం సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో మోనో వీల్ నడిపే సమయంలో దర్శకుడు డూప్ సహాయం తీసుకోమని చెప్పినా కూడా రవితేజ వినకుండా స్వయంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని .. ఓ రెండు మూడు రోజుల్లో కుదుటపడుతుందని చెబుతున్నారు యూనిట్ వర్గాలు.