ఎన్టీఆర్ వదిలేస్తేనే .. రవితేజకు దక్కిందా ?

Friday, October 20th, 2017, 10:43:09 AM IST

తాజాగా రవితేజ మంచి విజయాన్ని అందుకున్న ఖుషి లో ఉన్నాడు. వరుస పరాజయాల తరువాత అయన నటించిన రాజా ది గ్రేట్ దీపావళి సందర్బంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా విజయంతో ఇన్నాళ్లు టెన్షన్ పడ్డ రవితేజ కు మంచి రిలాక్స్ ఇచ్చింది. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ముందు ఎన్టీఆర్ చేయాల్సి ఉందట !! మొదట ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పాడట అనిల్ రావిపూడి, కథ బాగుంది కానీ ఎందుకో నేను చేయడం కరక్ట్ కాదేమో అని సినిమాను వద్దన్నాడట, దాంతో ఆ కథ రవితేజ దగ్గరికి చేరింది. కథ విన్నవెంటనే రవితేజ చేస్తానని చెప్పడంతో .. దిల్ రాజు లైన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరో అంధుడిగా సినిమా మొత్తం ఉండడం వల్లనే ఎన్టీఆర్ కాదన్నాడని గుసగుసలు విపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ వదిలేయడం వల్ల రవితేజ కు బాగా వర్కవుట్ అయిందిగా !!

  •  
  •  
  •  
  •  

Comments