నేల టిక్కెట్లు బిజినెస్‌ 50కోట్లు

Friday, May 25th, 2018, 10:00:34 AM IST

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ `నేల టిక్కెట్టు` ప్ర‌పంచ‌వ్యాప్తంగా 48 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసింది. శాటిలైట్ 13 కోట్లు, హిందీ డ‌బ్బింగ్ 12కోట్లు, థియేట్రిక‌ల్ హ‌క్కులు 22కోట్లు క‌లుపుకుని మొత్తం 48 కోట్ల మేర బిజినెస్ చేసింద‌ని ట్రేడ్ చెబుతోంది. రాజా ది గ్రేట్ చిత్రంతో ర‌వితేజ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు. రెండు వ‌రుస హిట్ల‌తో క‌ల్యాణ్ కృష్ణ స్టార్‌డ‌మ్ వెలిగిపోతోంది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమాకి చ‌క్క‌ని ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది.

ప్రాంతాల వారీగా ప్రీబిజినెస్ ప‌రిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ హ‌క్కులు 18.55కోట్ల బిజినెస్ పూర్త‌యింది. క‌ర్నాట‌క 1.45కోట్లు, ఓవ‌ర్సీస్ 1.5 కోట్లు. నైజాం-6.6కోట్లు, సీడెడ్ -3.05కోట్లు, ఉత్త‌రాంధ్ర‌-2.15కోట్లు, తూ.గో జిల్లా-1.45కోట్లు, ప‌.గో జిల్లా-1.25కోట్లు, కృష్ణ‌-1.45కోట్లు, గుంటూరు-1.8కోట్లు, నెల్లూరు-80ల‌క్ష‌లు, ఇత‌ర‌చోట్ల‌-50ల‌క్ష‌ల మేర‌ బిజినెస్ పూర్త‌యింది.ఇత‌ర చోట్ల‌ 1కోటి బిజినెస్ సాగింది. మొత్తంగా చూస్తే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర‌వితేజ `నేల టిక్కెట్టు` 50కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసింది. అయితే థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు త‌గ్గ‌ట్టు 25కోట్ల షేర్ వ‌సూలు చేస్తే ఈ సినిమా పెద్ద హిట్టు కొట్టిన‌ట్టు.

  •  
  •  
  •  
  •  

Comments