ఉగాది రోజున మాస్ రాజా ఫస్ట్ లుక్ ?

Tuesday, March 13th, 2018, 10:02:48 AM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి నెల టికెట్ అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హైద్రాబాద్ లో జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఉగాది రోజున విడుదల చేయాలనీ టీమ్ భావిస్తోందట. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల చేస్తారని తెలిసింది. రవితేజ తాజాగా చేసిన టచ్ చేసి చూడు సినిమా భారీ పరాజయం పాలవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే లో విడుదల చేస్తారట.