నాగార్జున దర్శకుడికి ఓకే చెప్పిన రవితేజ ?

Monday, December 4th, 2017, 10:14:44 AM IST

రాజా ది గ్రేట్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ జోరు పెంచేసాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు సినిమాలో నటిస్తున్న రవితేజ ఆ సినిమాను పూర్తీ చేసే పనిలో పడ్డాడు. దాంతో పాటు అటు శ్రీను వైట్ల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ మరో సినిమాకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రవితేజ నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా .. నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో ? అవును అక్కినేని నాగార్జునను సోగ్గాడిగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన కళ్యాణ్ కృష్ణ తాజాగా నాగ చైతన్య తో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తీసాడు.. తాజాగా అయన రవితేజ కు ఓ కథ వినిపిస్తే రవితేజ ఓకే చెప్పాడట .. దాంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. అన్ని కుదిరితే ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా మొదలు పెట్టాడట సదరు దర్శకుడు ?

  •  
  •  
  •  
  •  

Comments