రవితేజ నెక్స్ట్ చేసేది తమిళ్ రీమేకేనా ?

Tuesday, April 3rd, 2018, 10:15:13 AM IST

మాస్ రాజా రవితేజ ఈ మధ్య బాగా స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న అయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు శ్రీను వైట్ల తో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా తరువాత రవితేజ ఓ తమిళ్ రీమేక్ లో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే .. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ మద్యే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.

అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ సినిమా చేయనని చెప్పేసాడు, దాంతో సదరు దర్శకుడు ఇప్పుడు అదే కథను రవితేజ కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ కథ తమిళంలో హీరో విజయ్ హీరోగా నటించిన తేరి సినిమాకు రీమేక్ అని ఓ వైపు వార్తలు వస్తుండగా, మరో వైపు ఇది మరో కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తుందట. శ్రీను వైట్ల సినిమా పూర్తీ కాగానే సంతోష్ శ్రీనివాస్ చిత్రం పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.