మరో కొత్త యాంగిల్ లో రవితేజ సినిమా ?

Saturday, October 13th, 2018, 01:10:25 PM IST

మాస్ రాజా రవితేజ మరోలా సినిమాకు ఓకే చెప్పాడు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. భిన్నమైన సినిమాలతో సైన్టిఫిక్ నేపథ్యంలో సినిమాలకు టచ్ ఇచ్చే వి ఐ ఆనంద్ తాజాగా టైం మిషన్ నేపథ్యంలో ఈ సినిమాను రెటకెక్కించనున్నాడట. ఇప్పటికి రకరకాల కథలపై కసరత్తులు చేసినప్పటికీ ఈ కథ ఫైనల్ అయిందట. గతంలో టైం మిషన్ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో ఈ దర్శకుడు ఎలాంటి కథను చెబుతాడో. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దాంతో పాటు తమిళ తేరి చిత్రానికి రీమేక్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వి ఐ ఆనంద్ సినిమాలో నాబా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.