రవితేజ మూడు పాత్రలు చేయడం లేదట ?

Thursday, March 8th, 2018, 01:29:13 PM IST

మాస్ రాజా రవితేజ హీరోగా నటించే మరో సినిమా నేడు హైద్రాబాద్ లో మొదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా అమెరికాలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. వరుస పరాజయాల తరువాత శ్రీను వైట్లకు అవకాశం ఇచ్చాడు రవితేజ. అయితే ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది, దాంతో పాటు ఈ సినిమాకు అమర్ అక్బర్ ఆంటోని అనే టైటిల్ కూడా పెడుతున్నారంటూ తెలిసింది. తాజాగా ఈ సినిమా యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో నటించడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుందని టాక్. ఇక టైటిల్ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. రవితేజ సరసన హాట్ భామ అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. రవితేజ తో నీకోసం , వెంకీ, దుబాయ్ శీను, లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీను వైట్ల ఈ సినిమాతో మరి హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.