మూడు పాత్రల్లో రవితేజ నటిస్తున్నాడా ?

Tuesday, January 30th, 2018, 11:07:29 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న టచ్ చేసి చూడు ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ తో ఓ సినిమా చేస్తున్న రవితేజ ఆ తరువాత శ్రీను వైట్ల తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే శ్రీను వైట్ల స్క్రిప్ట్ విషయంలో బిజీగా మారాడు. ఈ సినిమా ఏప్రిల్ తరువాత సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో రవితేజ ఏకంగా మూడు పాత్రల్లో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అప్పట్లో హిందీలో అమితాబ్ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలా ఉంటుందంటూ ప్రచారం జరుగుతుంటే .. తాజాగా టచ్ చేసి చూడు ప్రచారంలో ఉన్న రవితేజ ఓ ఇంటర్వ్యూ సందర్బంగా మాట్లాడుతూ .. శ్రీను వైట్ల తో సినిమా ఉంటుంది. అందులో మూడు పాత్రలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది .. అది ఏమిటన్నది త్వరలోనే మీకు తెలుస్తుందంటూ చెప్పాడు. దీన్ని బట్టి చుస్తే ఖచ్చితంగా ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలు చేస్తున్నాడని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.