అమర్ అక్బర్ లను వాయిదా వేసారా ?

Monday, September 17th, 2018, 06:48:44 PM IST

మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రవితేజ మూడు భిన్నమైన షేడ్స్ లో కనిపించే ఈ సినిమాలో గ్లామర్ భామ ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో అది జనాలకు బాగా నచ్చేసింది. దాంతో దర్శక నిర్మాతలు ఇంకాస్త ఉత్సహంతో సినిమాను పూర్తీ చేసే పనుల్లో బిజీగా మారారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయాలనీ ప్రకంటించారు. కానీ ఆరోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదట ? కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను డిసెంబర్ 14కు వాయిదా వేసినట్టు టాక్ ? ఒక్కసారిగా ఈ సినిమాను రెండు నెలల పాటు ఎందుకు వాయిదా వేశారన్న విషయం సంచలనం రేపుతోంది. అయితే దానికి కారణం దసరాకు పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ సినిమాను వాయిదా వేసినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. అన్ని పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడం ఇష్టం లేకే వాయిదా వేసారట. సో ఈ వార్త తో మాస్ రాజా అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలినట్టే !!