టీడీపీ, బీజేపీ, జనసేన మళ్ళీ కలుస్తాయి.. తేల్చి చెప్పిన మాజీ ఎంపీ..!

Tuesday, January 14th, 2020, 12:00:24 AM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత కొద్ది రోజులుగా అమరావతి గ్రామాల రైతులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు మందడలో రైతుల దీక్షకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబ శివరావు మద్ధతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

అంతేకాదు జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన హాస్యాస్పదమని అన్నారు. అయితే వచ్చే ఎన్నికలలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పోటీ చేస్తారని అన్నారు. అయితే ఏపీ ప్రజలు ధైర్యంగా ఉండాలని ఎట్టి పరిస్థితులలోనైనా రాజధానిగా అమరావతే ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ తప్పకుండా గెలుస్తుందని, ఎవరూ ఆధైర్యపడాల్సిన పనిలేదని అన్నారు.