కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది – ఆర్బీఐ గవర్నర్

Wednesday, May 5th, 2021, 11:42:25 AM IST

భారత్ లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి తీవ్రత చాలా రంగాల పై ప్రభావం చూపిస్తుంది. అయితే తాజాగా భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి చూపిస్తున్న ప్రభావం గురించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్ భారత దేశాన్ని అతలాకుతలం చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కంటైన్ మెంట్ ప్రాంతాలు, భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే సూక్ష్మ మరియు మధ్య తరగతి సంస్థల పై ఈ రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. అయితే ఆర్బీఐ గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.