ఆర్‌బిఐ మరో కీలక నిర్ణయం : రూ.2వేల నోటు పరిస్థితి ఏంటి…?

Tuesday, October 15th, 2019, 08:15:35 PM IST

పెద్ద నోట్ల విషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఆర్‌బిఐ, పెద్ద నోట్ల ను రద్దు చేసి అప్పట్లో ఒక పేడాడ చర్చకు దారి తీసింది. కాగా అలాంటి ఆర్‌బిఐ తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకుంది. కాగా మన భారత కరెన్సీలో అత్యధిక విలువ కలిగిన రూ.2వేల నోటు ముద్రణను ఆర్‌బిఐ నిలిపివేసి మరొక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కూడా ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదని సమాచారం. దానికి కారణం లేకపోలేదు. కొద్దీ రోజుల క్రితం 6 కోట్ల బ్లాక్‌మనీ పట్టు బడిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి బ్లాక్ మనీ ని అరికట్టేందుకే ఆర్‌బిఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని సమాచారం.

అయితే ఒక ప్రత్యేక మీడియాకి సమాధానంగా చెప్పిన ఆర్‌బిఐ మాట్లాడుతూ… మనదేశంలోని నల్లధనాన్ని అంతా బయటకు తీసి, అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బిఐ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. అయితే 217 లో రూ .2 వేల కరెన్సీ నోట్లను 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించగా, 2018లో 111.507 మిలియన్ నోట్లు మాత్రమే ముద్రించింది. ఆ తరువాత 2019లో మరీ దారుణంగా 46.690 మిలియన్ల రూ.2వేల నోట్లను మాత్రమే అమలులోకి తీసుకొచ్చింది.