ఇక పండగ చేస్కోండి..ఆ ఖాతాలకు విత్ డ్రా పరిమితులు ఎత్తివేసిన ఆర్బీఐ !

Monday, January 30th, 2017, 07:15:06 PM IST

atm
పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు విత్ డ్రా లపై ఆర్బీఐ పరిమితులు విధించిన విషయం తెలిసిందే.కాగా ఈ విత్ డ్రా పరిమితులను కరెంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులను ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్రక్రియ అమలు లోకి రానునట్లు ఆర్బీఐ తెలిపింది. కానీ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రస్తుతం ఉన్న పరిమితులు యధాతధంగా కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నతరువాత బ్యాంకులనుంచి వారానికి రూ 24 వేలు, ఏటీఎం లనుంచి రూ 2 వేలు విత్ డ్రా చేసుకునేలా ఆర్బీఐ పరిమితులు విధించిన విషయం తెలిసిందే. కొత్త నోట్ల చలామణి పెరగడంతో ఇటీవల ఆ పరిమితిని రూ 10 వేలుకు పెంచింది.

కాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఖర్చులుంటాయని విత్ డ్రా పరిమితిని పెంచాలని ఎన్నికల సంఘం ఆర్బీఐ ని కోరింది. మొదట దీనికి నిరాకరించిన ఆర్బీఐ తాజాగా విత్ డ్రా పరిమితి ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.కాగా సేవింగ్స్ ఖాతాలపై మాత్రం షరతులు యధాతధంగా కొనసాగుతాయని ఆర్బీఐ ప్రకటించింది.వాటిపై కూడా విత్ డ్రా పరిమితిని ఎత్తివేసే విషయం చర్చిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.