రూ.500 నోటు తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..?

Saturday, January 21st, 2017, 12:25:23 AM IST

money
ఆర్బీఐ కొత్తగా ముద్రిస్తున్న రూ.500 నోటు తయారీకి ఎంత ఖర్చవుతుందో అన్న విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. 500 నోటు తయారీకి రూ 3.09 ఖర్చు అవుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ముంబై కి చెందిన అనిల్ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం చెప్పింది.

కానీ త్వరలో తీసుకురాబోయో 1000 నోటుకు ఎంత ఖర్చు చేయనున్న విషయాన్ని మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు. 2016 – 17 లో ముద్రణ కాట్రాక్టుని పొందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రను ప్రైవేట్ లిమిటెడ్ 500 నోటుని తయారు చేస్తుంది. అయితే కాంట్రాక్టు విలువనిగాని, ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల్ని గాని ఆర్బీఐ వెల్లడించలేదు.