అయేషామీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి – ఇప్పుడైనా నిందితులు దొరుకుతారా…?

Saturday, December 14th, 2019, 04:15:51 PM IST

గతంలో విజయవాడలో జరిగినటువంటి బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్యోదంతం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటివరకు కూడా ఈ హత్యోదంతం అనేకమైన మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ హత్య జరిగి ఇప్పటికి 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి ఈ కేసులో నిందితులు ఎవరు అనేది అసలే తెలియడం లేదు. కాగా ఇప్పటికైతే ఈ కేసు సిబిఐ దగ్గరకు చేరుకుందని చెప్పాలి. కాగా అయేషామీరా మృతదేహానికి కొద్దీ సేపటి క్రితం రీ పోస్టుమార్టం జరిగింది. కాగా పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలని అధికారులు పరిశీలించారు.

కాగా అయేషామీరా మృతదేహంతో ఎముకల నుంచి అవశేషాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది. కాగా ఈ తతంగం అంత కూడా అయేషామీరా కుటుంబ సభ్యుల సమక్షంలో అంతా ప్రొసీజర్‌ ప్రకారం జరిగింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అప్పట్లో సత్యం బాబు అనే యువకుడిని అరెస్టు చేసినప్పటికీ కూడా, సరైన ఆధారాలు లేని కారణంగా సత్యం బాబు ని నిర్దోషిగా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పుడైనా ఈ కేసులో నిందితులు ఎవరో తెలుస్తుందో లేదో అని యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. కాగా ఈ దారుణ హత్య వెనుక అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనుమడు సతీశ్‌, అతని మిత్రులు ఉన్నారనే ఆయేషా తల్లి షంషాద్‌ బేగం ఆరోపణలు చేస్తున్నారు.