క్రేజీ మల్టి స్టారర్ కోసం స్టోరీ సిట్టింగులు ?

Wednesday, May 23rd, 2018, 09:55:13 AM IST

టాలీవుడ్ తెరకెక్కనున్న క్రేజీ మల్టి స్టారర్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. # RRR కంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు వచ్చినప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దానికి తోడు మెగా ఫామిలీ .. నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తుండడం కూడా మరో ఆసక్తికి కారణం. తాజాగా ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని .. త్వరలోనే ఎన్టీఆర్ – చరణ్ లకు స్క్రిప్ట్ వినిపించేందుకు రెడీ అయ్యాడట మన జక్కన్న. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉండగా, తారక్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టైం చూసుకుని ఇద్దరి హీరోలకు స్క్రిప్ట్ వినిపించాలని ఫిక్స్ అయ్యాడట. డివివి దానయ్య నిర్మించే ఈ సినిమాకు సంబందించిన పూర్తీ వివరాలు జూన్ లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ క్రేజీ మల్టి స్టారర్ ఎలా ఉంటుందో .. అన్న ఆసక్తి అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.

  •  
  •  
  •  
  •  

Comments