సీఎం జగన్ రాజధాని అమరావతి ప్లాన్ కోసం రియల్ ఎస్టేటర్ల ఎదురు చూపులు..!

Wednesday, June 12th, 2019, 09:09:46 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే రాజధాని విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని చక్కదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు.

అయితే అందులోనే భాగంగా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుపడే వరకు రాజధాని పనులు కొన్నిటిని ఆపేయాలని సూచించాడు. సీఆర్‌డీఎస్ పూర్తి సమంక్ష జరిపిన తరువాత నుర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అందుకే శాశ్వత హైకోర్ట్, అసెంబ్లీ సచివాలయ పనులను కొద్ది రోజులు నిలిపివేయాలనే యోచనలో ఉందట. అయితే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వారు మాత్రం సీఎం జగన్ అనుమతులిస్తే పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. అయితే దీనిపై రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ జనరల్ సెక్రటరీ వైవీ రమణారావ్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం జగన్ అమరావతి ప్లాన్ ఎలా ఉండబోతుందో దానికోసమే వేచి ఉన్నాము అని చెప్పారు. అయితే కొంత మంది మాత్రం జగన్ అమరావతిలో ప్లాన్ చేసిన కొన్ని గవర్నమెంట్ కార్యాలయాలను విజయవాడ నుంచి తరలించేలా ప్లాన్ చేస్తున్నరని వార్తలు కూడా వినిపించాయి. అందుకోసం పలు చోట్ల స్థలాల కొనుగోలు కూడా చేస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు. అయితే విజయవాడ మరియు గుంటూర్ హైవే మధ్యలో హౌసెస్ మరియు అపార్ట్‌మెంట్స్ కట్టే యోచనలో ఉన్నారట.