ఏపీలో బీర్లు తాగే బాబులకు ఇది నిజంగా చేదువార్తే..!

Saturday, August 24th, 2019, 04:57:45 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నాడు. అయితే ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి వస్తే మధ్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్టే ఏపీలో వైసీపీ అధికారలోకి వచ్చేసింది.

అయితే ఇచ్చిన మాట ప్రకారం మధ్యపాన నిషేదం అమలుపై దృష్టి పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం మద్యం నుంచే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తుండడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మధ్యాన్ని ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా నిషేధిస్తున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం ఇప్పటికే కొత్త మధ్యం పాలసీనీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక మీదట ఎవరుపడితే వారు మధ్యం అమ్మడానికి వీలులేదని మధ్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని తేల్చి చెప్పారు. అయితే ఈ నూతన మధ్యం విధానం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

అయితే ఇదంతా బాగానే ఉన్నా ఏపీలో బీర్లు తాగే వారికి ఒక చేదు వార్త వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం నిర్వహించే అన్ని మధ్యం దుకాణాలలో రిఫ్రిజరేటర్లు పెట్టించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే కూలింగ్ లేకుండానే బీర్లను కూడా అమ్మాలని నిర్ణయించింది. అయితే ఫ్రిజ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో అధికారులు కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఇదే కనుక జరిగితే బీర్ ప్రేమికులకు కష్టాలు తప్పవనే అర్ధమవుతుంది.