హాట్ టాపిక్: ఛలో ఆత్మకూరు… అసలెందుకు? పల్నాడులో 144 సెక్షన్

Tuesday, September 10th, 2019, 07:29:05 PM IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన మొత్తం అరాచకాలు, అన్యాయాలు, దాడులు, అవినీతి ఇలా చాల జరిగాయి అని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ (వైసీపీ) దాడులకు గానూ , తాను వైసీపీ బాధితుల కొరకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నారు. తమ కార్యకర్తలు, ప్రజలు తమ గ్రామాలకు చంద్రబాబే స్వయం గా తీసుకెళ్తానని కూడా తెలిపారు. ఈ ఉదేశ్యం గానే టీడీపీ కి సంబందించిన అందరు లాయర్లను అక్కడికి రావాల్సిందిగా ఆదేశించారు. ఛలో ఆత్మకూరు పేరు తో నిరసన చేపట్టనున్నారు.

టీడీపీ నేతల చర్యలకు కౌంటర్ గా వైసీపీ నేతలు కూడా టీడీపీ బాధితుల పునరావాస కేంద్రం అని పిడుగు రాళ్ళలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా, చంద్రబాబు రాజకీయంగా జగన్ పై ఒత్తిడి పెంచేందుకు చలో ఆత్మకూరు ప్రకటించినట్లు గా, వైసీపీ నేతలు కూడా ఒకే రోజు సెప్టెంబర్ 11 న ఛలో ఆత్మకూరు అని ప్రకటించారు. విషయం ఏమిటంటే ఈ నిరసనలకు, ర్యాలీలకు పోలీస్ యంత్రంగం ఏ ఒక్కరికి పర్మిషన్ ఇవ్వలేదు. కాగా పల్నాడు లో 144, 30 సెక్షన్ లు విధించామని డీఎస్పీ గురజాల ప్రకటించడం హాట్ టాపిక్ ఐంది.

పలు విషయాలని వివరించే ప్రయత్నం చేసారు డీఎస్పీ. అసలు రాజకీయ దాడులు ఇక్కడ ఏమి జరగలేదు అని, ఒక వర్గానికి సంబందించిన కుటుంబ తగాదాలే అని తెలిపారు. పల్నాడు చాల ప్రశాంతం గా ఉందని, 11 న జరిగే ఎలాంటి చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా అక్కడికి వెళ్లి తీరతామని ఈ రెండు పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలిపాయి. దీనికి సంబంధించి ఎం జరుగుతుందో అని ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.ఎం జరుగుతుందో ఆ రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో తెలియాలంటే సెప్టెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే.