హుజూర్‌నగర్‌లో టీడీపీ పోటీ చేయడానికి అసలు కారణం ఇదేనా..!

Wednesday, October 9th, 2019, 02:09:21 AM IST

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 21న ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి, అధికార పార్టీ నుంచి సైది రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి, ఇండిపెండెంట్‌గా తీన్మార్ మల్లన్న వంటి వారు ముఖ్యంగా బరిలో ఉన్నారు.

అయితే గతంలో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానం కాబట్టి అటు కాంగ్రెస్, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రెండు ఈ స్థానం కోసం గట్టిగానే పోటీ పడుతున్నాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా టీడీపీ కూడా ఈ సారి బరిలో దిగడంతో ఈ ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారిపోయింది. అయితే టీడీపీ అభ్యర్థిగా ఉన్న చావ కిరణ్మయికి మద్ధతుగా ప్రచారం చేసేందుకు సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 13వ తేది నుంచి హుజూర్‌నగర్‌లో బాలకృష్ణ పర్యటన సాగుతుందని పార్టీ నేతలు అంటున్నారు. అయితే అటు ఏపీలో కూడా ఘోరంగా ఓటమిపాలైన టీడీపీ ఇక్కడ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేస్తుందో ఇప్పటికి ఎవరికి అర్ధం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే చంద్రబాబు మాత్రం ఓటమిని లెక్క చేయకుండా పార్టీనీ రెండు తెలుగు రాష్ట్రాలలో పటిష్టం చేయాలని, తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఈ ఎన్నిక నుంచే క్యాడర్ మళ్ళీ యాక్టివ్ కావాలని భావించి ఈ ఎన్నికలలో పోటీకి సై అంటున్నారట.