రామ్ చరణ్ ఇబ్బందికి పవన్ కారణం కాదా..?

Friday, October 20th, 2017, 01:47:51 PM IST

రామ్ చరణ్ తాజగా నటిస్తున్న చిత్రం రంగస్థలం 1985. ఏ చిత్ర విడుదల తేదీని మొదట సంక్రాంతిగా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదని తెలుస్తోంది. దీనికి కారణంగా మొదట అంతా పవన్ కల్యాణే అని అనుకున్నారు. బాబాయ్ సినిమా సంక్రాంతికి వస్తుండడంతో పోటీ సరికాదని చరణ్ రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక వేళ ఇదే రీజన్ అయితే జనవరి చివర్లోనో ఫిబ్రవరి మొదట్లోనో చిత్రాన్ని సోలోగా విడుదల చేసుకోవచ్చు.

కానీ ఏకంగా ఈ చిత్రం మార్చి నెలాఖరకు పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ చిత్ర విడుదల ఆలస్యానికి కారణం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల చిత్రం కాదని,రంగస్థలం షూటింగ్ విషయంలోనే ఏదైనా సమస్య ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడు నెలల పాటు ఆలస్యమయ్యేంత సమస్య ఏమై ఉంటుందని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.