రెబ‌ల్‌స్టార్ గ‌వ‌ర్న‌ర్ అయ్యేదెప్పుడు?

Friday, January 20th, 2017, 02:00:17 PM IST

krishnam-raju
ఉప్ప‌ల‌పాటి వెంక‌ట కృష్ణం రాజు.. ఇదీ రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు పూర్తి నామ‌ధేయం. 20 జ‌న‌వ‌రి 1940లో జ‌న్మించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నారు, కృష్ణ‌, శోభ‌న్‌బాబు వంటి దిగ్గ‌జాలు సినీప‌రిశ్ర‌మ‌ని ఏల్తున్న రోజుల్లోనే ఆయ‌న సినీఆరంగేట్రం చేసి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంద‌ని నిరూపించుకున్నారు. ఆరున్న‌ర అడుగుల ఆజానుబాహుబ‌డిగా .. త‌న‌దైన శైలిలో వెండితెర‌పై వెలుగులు ప్ర‌స‌రించారు. భారీ యాక్ష‌న్ చిత్రాల‌తో రంగూన్ రౌడీగానూ పాపుల‌రై నాడు విల‌క్ష‌ణ‌త చాటుకున్నారు. సినీకెరీర్‌లో దాదాపు 190 సినిమాల్లో న‌టించారు. 1966లో `చిల‌క గోరింక‌` అనే చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ఆరున్న‌ర అడుగుల ఆజానుబాహుబాహుడు రెబ‌ల్‌స్టార్‌గా ఎదిగిన వైనం తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలుసు. కెరీర్‌లో ఐదు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న రెబ‌ల్‌స్టార్ మూడు ప్ర‌తిష్ఠాత్మ‌క నందులు అందుకున్నారు. సినిమాల అనంత‌రం రాజ‌కీయ‌నేత‌గానూ అనుభ‌వం ఘ‌డించారు. బీజేపీ త‌ర‌పున‌ కాకినాడ నుంచి ఓసారి, న‌ర‌సాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓసారి పోటీ చేసి లోక్‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగారు. వాజ్‌పేయి హ‌యాంలో మంత్రిగానూ కొన‌సాగారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రేసులోనూ కృష్ణంరాజు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ `రెబ‌ల్‌` ప్ర‌భాస్‌కి కృష్ణంరాజు స్వ‌యానా పెద‌నాన్న‌. ప్ర‌భాస్ న‌టించిన బిల్లా, రెబ‌ల్ చిత్రాల్లోనూ కృష్ణంరాజు న‌టించారు. నేడు కృష్ణంరాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.

కృష్ణంరాజు న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌: జీవ‌న త‌రంగాలు (1973), కృష్ణ‌వేణి (1974), భ‌క్త క‌న్నప్ప (1976), అమ‌ర‌దీపం (1977), స‌తీసావిత్రి (1978), క‌ట‌క‌టాల రుద్ర‌య్య (1978), మ‌న ఊరి పాండ‌వులు (1978), రంగూన్ రౌడీ (1979), శ్రీ వినాయ‌క విజ‌యం (1979), సీతా రాములు (1980), టాక్సీ డ్రైవ‌ర్ (1981), త్రిశూలం (1982), ధ‌ర్మాత్ముడు (1983), బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న (1984), తాండ్ర పాపారాయుడు (1986), మ‌ర‌ణ శాస‌నం (1987), విశ్వ‌నాథ నాయ‌కుడు (1987), అంతిమ తీర్పు (1988), బావ బావ‌మ‌రిది (1993), ప‌ల్నాటి పౌరుషం (1994), .. ఇంకా ఎన్నో.