గంటా గట్టిగానే మోగుతుంది…మరో సంకేతం ఇచ్చిన గంటా శ్రీనివాసరావు

Wednesday, August 14th, 2019, 07:25:53 AM IST

మెడలో కండువా మార్చినంత ఈజీగా పార్టీ మారిపోయే వ్యక్తి గంటా శ్రీనివాసరావు. అధికారం చేతిలో లేకపోతే అసలు తట్టుకోలేడు. ఎదో ఒకటి చేసి అధికారం పక్షము వైపు ఉండాలనేది గంటా యొక్క రాజకీయ ఆశయం. తెలుగుదేశం కావచ్చు,ప్రజారాజ్యం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మళ్ళీ తెలుగుదేశం కావచ్చు, ఎక్కడికెళ్లినా ఏమి చేసిన ఆయనకి అధికారం కావాలనే విషయం అందరికి తెలుసు.

ఇక ప్రస్తుతం టీడీపీలో ఉన్న గంటా వైసీపీలోకి వెళ్ళిపోతాడనే ప్రచారం చాలా రోజుల నుండి సాగుతూనే ఉంది. వీటిపై గంటా ఎప్పుడు కూడా స్పదించలేదు,ఖండించలేదు. ఆయన వాలకం చూస్తుంటే రేపో మాపో పార్టీ మారిపోతాడు అనిపిస్తూనే ఉంది. తాజాగా చంద్రబాబు నాయుడు విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాడు. దానికి గంటా రాకపోవటం ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున్న చర్చకి వస్తుంది.

ఫలితాలు వచ్చిన దగ్గర నుండి పార్టీకి దూరంగా ఉంటూనే వస్తున్నాడు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు. గతంలో వైసీపీ మీద ఒంటి కాలితో లేచే గంటా ఇప్పుడు ఒక్క మాట కూడా అనటం లేదు. పులివెందుల వెళ్ళిమరి జగన్ ని ఓడిస్తా అంటూ సవాళ్లు చేసిన గంటా ఇప్పుడు మాట్లాడకపోవటం విశేషం . ఇవన్నీ గమనిస్తే ఆయన పార్టీ మారాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నట్లు తెలుస్తుంది.