బిగ్ బ్రేకింగ్ : ఏపీలో ఇదే బిగ్గెస్ట్ రికార్డా?ఒక్క రోజులో ఇన్ని కేసులా?

Sunday, May 31st, 2020, 03:20:08 PM IST

ఇప్పుడు ఏపీలో కరోనా వలన పరిస్థితులు మరింత దైవిథ్యమానంగా తయారయ్యేలా ఉన్నాయని చెప్పాలి. గత రెండు నెలల నుంచి మన దగ్గర భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఊహించని కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి.

కొన్ని రోజుల కితం వరకు తగ్గుతూ పెరిగాయి కనై ఇప్పుడు అయితే తగ్గే మాట పోయి ఒక రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఈసారి మాత్రం రికార్డు బ్రేకింగ్ కేసులే నమోదు అయ్యాయి అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 9 వేల 370 శాంపిల్స్ ను పరీక్షించగా ఈసారి ఏకంగా 98 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

బహుశా ఇదే మన రాష్ట్రంలో అత్యధికం కావచ్చు. ఈ ఒక్క దెబ్బతో ఏపీలో కేసుల సంఖ్యా 3 వేల మార్కును దాటేసి 3 వేల 42 కు చేరిపోగా ఇద్దరు మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. మరి ఇక ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.