బిగ్ న్యూస్ : ఏపీలో రికార్డు స్థాయి కరోనా కేసులు..ఇలా అయితే కష్టమే!

Tuesday, March 31st, 2020, 12:29:06 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మరింత విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అలా మన దేశంలో కూడా ఈ మహమ్మారి అంతకంతకూ పెరిగిపోతూ వస్తుంది. అయితే మన రెండు రాష్ట్రాల తెలుగు విషయానికి వచ్చినట్టయితే మొదటగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదు కాగా ఆంధ్రాలో మాత్రం కేవలం సింగిల్ డిజిట్ లలోనే ఉండడం కాస్త ఊరట కలిగించే విషయం అని అంతా భావించారు.

అదే సమయంలో మరోపక్క తెలంగాణలో మాత్రం ఒక్కొక్కటిగా అలా కేసులు పెరిగిపోతూ ఇప్పుడు ఎనభై దగ్గరకు వచ్చేసాయి. కానీ ఏపీ పరిస్థితి మాత్రం ఇప్పుడు తెలంగాణను మించిపోయేలా ఉందని తెలుస్తుంది. తాజాగా ఢిల్లీకి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి వచ్చిన వారిలోనే అత్యధికంగా కరోనా లక్షణాలు ఉన్నాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంచలన ప్రకటన చేసాయి.

ఏపీలో జస్ట్ నిన్న రాత్రిలోనే ఏకంగా 17 కొత్త కరోనా కేసులు రిజిస్టర్ కావడం విస్మయానికి గురి చేసింది. ఈ 17 మంది కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారే వారి జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసారు. ఏయే జిల్లాలో ఎంతేసి మంది ఉన్నారన్నది కూడా తెలిపారు. ఒకసారి ఆ జాబితాను మీరు కూడా చూడండి.ఈ 17 తో ఏపీలో కేసులు ఒక్కసారిగా 40కు ఎగబాకేసింది. ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా తెలంగాణ కంటే కూడా దారుణమైన పరిస్థితులు నెలకొనడం ఖాయం అని చెప్పాలి.