బ్రేకింగ్ : ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా..తాజా లెక్కలు.!

Wednesday, May 27th, 2020, 11:54:21 AM IST

ఏపీలో కరోనా వైరస్ మరింత స్థాయిలో ఉదృతం దాలుస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున కేసులు నమోదు అవుతుండడం పైగా వాటి వివరాలు వెల్లడించకపోవడం వంటివి ఇప్పుడు మరింత సంచలనంగా మారుతున్నాయి.

ఏపీలో కరోనా గ్రాఫ్ ఇప్పుడు మరోసారి పెరుగుతుంది. అలా ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు తాజాగా నమోదు కాబడిన కేసుల వివరాలను వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 9 వేల 664 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో ఏకంగా 68 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

మళ్ళీ చాలా కలం తర్వాత ఇదే రికార్డు నెంబర్ అని చెప్పొచ్చు. అయితే ఈ కేసులతో మొత్తం ఏపీలో 2 వేల 787 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాగా 19 వందల 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరి ఏపీలో ఈ కరోనా ప్రభావం ఇంకెప్పుడు తగ్గుతుందో చూడాలి.