బిగ్ న్యూస్ : తెలంగాణా రికవరీ రేటు చాలా బాగుందట..!

Thursday, July 23rd, 2020, 10:28:57 AM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున కేసులు నమోదు అవుతుండడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు వచ్చిపడుతున్నాయి.

ఇదిలా ఉండగా మరోపక్క తమ రాష్ట్రాల్లో వైద్య సేవలు మెరుగ్గా అందిస్తున్నామని చెప్తున్నారు.అయితే మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు వారు వారి దగ్గర కరోనా రికవరీ రేటు బాగానే ఉందని అంటున్నారు.

కరోనా బారిన పడి కోలుకున్న వారి రేటు ఇప్పుడు తెలంగాణలో 78.37 శాతానికి చేరుకుంది అని ఇది మన దేశపు సగటు రేటు కంటే అధికం అని వారు అంటున్నారు. అంతే కాకుండా ఈ రికవరీ రేటులో తెలంగాణా భారత్ లొనే మూడో స్థానంలో నిలబడింది అని వారు అంటున్నారు.