బిగ్ న్యూస్: ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ, ఎలా దొరికాడో తెలుసా?

Thursday, February 13th, 2020, 12:03:28 PM IST


ఆంధ్ర ప్రదేశ్ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అయితే సంతకం మాత్రమే కాకుండా, లెటర్ హెడ్ తో సహా ఫోర్జరీ చేయడం పట్ల మంత్రి వనిత ఈ విషయాన్ని చాల సీరియస్ గా తీసుకున్నారు. ఆ వ్యవహారం ఫై డీజీపీ కి మరియు హోం మంత్రి సుచరిత లకు ఫిర్యాదు చేసారు. తన లెటర్ హెడ్, మరియు సంతకాన్ని ఫోర్జరీ చేయడం ఫై రెడ్డప్ప ఫై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని కోరడం జరిగింది. అయితే రాష్ట్రంలో మంత్రి సంతకం, లెటర్ హెడ్ ఫోర్జరీ కావడంతో ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గంలో చర్చాంశంగా మారింది.

అసలు విషయం లోకి వస్తే రెడ్డప్ప అనే వ్యక్తి మంత్రి వనిత సంతకం, లెటర్ హెడ్ ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తుంది. ఆ లెటర్ హెడ్ ఫై కలెక్టర్ కి మంత్రి తరపున సిఫారసు లేక రాసినట్లుగా నమ్మించాడు. రెడ్డప్ప కి అసైన్డ్ భూములు కేటాయించాలి అన్నట్లుగా లేఖలో పేర్కొన్నాడు. అయితే మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడం తో రెడ్డప్ప దొరికిపోయాడు. అయితే ఆ వ్యక్తి టీడీపీ నేత అయి ఉండే అవకాశం ఉన్నట్లుగా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.