కోలీవుడ్ పైనే పెళ్లి చూపులు భామ ఆశలు ?

Thursday, February 15th, 2018, 10:55:10 AM IST

పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ రీతూ వర్మ కు ఆ సినిమా తరువాత అవకాశాలైతే వచ్చాయి కానీ .. అనుకున్న సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత చేసిన కేశవా చిత్రం పరాజయం పాలవడంతో పాపం ఈ అమ్మడికి తెలుగులో ఒక్క అవకాశము రావడం లేదు. దాంతో కోలీవుడ్ పై ద్రుష్టి పెట్టిన ఈ తెలుగు పిల్ల కు అక్కడ బాగానే వర్కవుట్ అయింది. తమిళంలో తెలుగు హీరోయిన్స్ కు కాస్త క్రేజ్ ఎక్కువే .. అదే కోవలో ఈ అమ్మడికి అవకాశాలు వచ్చాయి .. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు మీడియం రేంజ్ హీరోలతోనే అవకాశాలు వస్తున్నాయి. అయినా సరే తనకు క్రేజ్ రావడం కోసం అన్నింటికీ ఓకే చెబుతున్న రీతూ .. అటు గ్లామర్ విషయంలో కూడా కండిషన్స్ ని పక్కన పెట్టేసిందట. ఇక తమిళంలో రెండు వరుస హిట్ పడ్డాయంటే ఈ భామ స్పీడ్ ని ఎవరు కంట్రోల్ చేయలేరేమో !! ఇకపై కూడా తన ఫోకస్ మొత్తం కోలీవుడ్ పైనే అని చెబుతుంది.