కాస్టింగ్ కౌచ్ పై రెజినా సంచలన వాఖ్యలు?

Sunday, April 29th, 2018, 09:45:29 AM IST

ప్రస్తుతం సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న అంశం కాస్టింగ్ కౌచ్. సినిమా హీరోయిన్స్ కు లైంగిక వేధింపుల విషయంలో ఇప్పటికే పలువురు నటీమణులు బాహాటంగా తమపై జరిగిన వేధింపుల విషయాన్నీ బయటపెట్టడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ఒక్కొక్కరుగా ఈ వ్యవహారం పై స్పందించడం సంచలనం రేపుతోంది. తాజాగా గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రెజినా కాసాండ్రా కూడా స్పందించింది. ఇటీవలే నాని నిర్మించిన అ ! సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ .. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం నిజమే .. ఈ విషయంలో నేను కూడా చాలా సార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పింది. తాజాగా ఓ యువకుడు పబ్లిక్ లోనే తనను తాకడానికి ప్రయత్నించాడని, తన పెదాలను .. మిగతా చోట్ల తాకడానికి ట్రై చేసాడని చెప్పింది. ప్రస్తుతం రెజినా కు చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ప్రస్తుతం తమిళంలో మిస్టర్ చంద్రమౌళి సినిమాలో మాత్రమే నటిస్తున్న ఈ భామ ఈ మద్యే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments