వీడియో : రెజీన చీర‌లో కికి కికి!

Tuesday, July 31st, 2018, 03:27:31 AM IST

కికి ఛాలెంజ్‌… ప్ర‌స్తుతం యూత్‌లో జోరుగా వైర‌ల్ అవుతున్న ట్రెండ్ ఇది. క‌దులుతున్న వాహ‌నం నుంచి దిగి ఆ క‌ద‌లిక‌తో పాటుగా మూవ్ అవుతూ డ్యాన్సులు చేసే ఓ అరుదైన ప్ర‌క్రియ ఇది. దీనినే కికి చాలెంజ్ అంటూ యూత్ తెగ మురిసిపోతూ ట్రెండ్‌ని ఫాలో అయిపోతోంది. అయితే ఈ ట్రెండ్ కాస్తంత డేంజ‌ర్ జోన్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఇదే త‌ర‌హా కికి ఛాలెంజ్‌లోకి రెజీన వ‌చ్చి చేర‌డం యువ‌త‌రం క‌ళ్ల‌కు కునుకు ప‌ట్ట‌నీకుండా చేసింది. రెజీన ర‌న్నింగ్ కార్‌లోంచి దిగి కికి డ్యాన్సుల‌తో అట్టుడికించింది. జెడ నిండా మ‌ల్లె చెండు పెట్టుకున్న రెజీన ఎర్ర‌రంగు హాఫ్ శారీలో మ‌తి చెద‌ర‌గొట్టింది. అలా దిగి కార్‌తో పాటే క‌దులుతూ అదిరిపోయే స్టెప్పులేసింది. చివ‌రిలో అంతే అదిరిపోయే స్మైల్‌తో ఫినిషింగ్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో కుర్ర‌కారు వాట్సాప్‌లు, సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

  •  
  •  
  •  
  •  

Comments