కేరళ వరదబాధితులకు రెహమాన్ భారీ విరాళం!

Monday, September 3rd, 2018, 03:58:51 PM IST

మొన్నటి వరకు వరదలతో సతమతమైన కేరళ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి గృహాలు సైతం కొట్టుకుపోయాయి. కొండ చరియలు విరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు రాష్ట్రమంతా జన వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలకు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. అయితే కేరళకు దేశమంత మద్దతుగా నిలిచింది. వెయ్యి కోట్లకు పైగా విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్ కి చేరాయి.

ఇకపోతే సినీ తారలు కూడా ముందుకు వచ్చి విరాళాలు అందించారు. ఇక భారతదేశ దిగ్గజ సంగీత దర్శకుడు రెహమాన్ కూడా కేరళకు తనవంతు సహాయాన్ని అందించారు. ఇంతకుముందే రెహమాన్ వరదబాధితులను ఉద్దేశించి ఒక పాట పాడారు. ‘కేరళ, కేరళ, డోన్ట్‌ వర్రీ కేరళ’ అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు దైర్యం చెప్పారు. ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక రీసెంట్ గా ఆయన కోటి రూపాయల నగదును కేరళ వరద బాధితులకు ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఆదివారం తన బృందంతో కలిసి అమెరికాలో సంగీత విభావరి నిర్వహించిన రెహమాన్ తన టీమ్ తో కలిసి కేరళకు మా వంతు సాయం చేశాం. వారికి ఈ విరాళం కాస్త ఊరట ఇస్తుందని ఆశిస్తున్నట్లు ట్విట్టర్ లో రెహమాన్ పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments