2.0 ఆడియో వేడుక స్పెషల్ అదేనట!

Monday, October 23rd, 2017, 11:47:11 AM IST

ప్రస్తుతం భారతదేశ సినీ ప్రేక్షకులు అందరు అత్యంత ఆసక్తిగా రజినీకాంత్ 2.0 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ఒక పాట చిత్రీకరణతో మొత్తం పూర్తయ్యింది. రీసెంట్ గా ఒక భారీ సెట్ లో రజినీకాంత్ – అమీ జాక్సన్ మధ్య సాంగ్ నిషూట్ చేసిందట చిత్ర యూనిట్. అలాంగ్ గ్రాఫిక్స్ పనులు కూడా దాదాపు చివరి దశలో ఉన్నాయి. పైగా రెహమన్ స్వరపరచిన పాటలు కూడా పూర్తయ్యాయి. అయితే ఆడియో వేడుకను దుబాయ్ లో ఈ నెల 27న గ్రాండ్ గా చేయనున్నారట చిత్ర యూనిట్ సభ్యులు. రెహమాన్ లైవ్ పర్ఫామెన్స్ ఆ వేడుకలో స్పెషల్ అని చెబుతున్నారు. దాదాపు 450 కోట్లతో లైకా నిర్మాణ సంస్థ ఈ సినిమాను రూపొందించారు.2018 జనవరి 25న 2.0 రిలీజ్ కానుంది.